కూటమి ప్రభుత్వం వృద్ధుల కోసం మరో ముందడుగు
ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి సీనియర్ సిటిజన్ కార్డును వృద్ధులకు ఇవ్వనుంది.
60 ఏళ్లు నిండిన పురుషులకు మరియు 58 ఏళ్ళు నిండిన మహిళలకు ఈ కార్డు వర్తిస్తుంది. ఈ కార్డు అనేది డిజిటల్ రూపంలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా వారికి అందిస్తారు. ఈ కార్డు పొందుటకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ ,బ్యాంకు ఖాతా పుస్తకం మరియు కుల ధ్రువీకరణ పత్రం దీనితోపాటు 40 రూపాయలు చెల్లించి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి వృద్ధులు గౌరవాన్ని కాపాడేందుకు గాను ఈ సీనియర్ సిటిజన్ కార్డును వృద్ధులకు ఇవ్వనుంది. వృద్ధులు ఈ కార్డును ఉపయోగించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అనేక రకాల సేవలను ఈజీగా పొందవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్డును ఇవ్వనుంది.
ఈ కార్డు ద్వారా ఉపయోగాలు ఏమిటి?
ఈ కార్డు ఉపయోగించడం వలన ప్రభుత్వ పథకాల్లో మరియు రవాణా బ్యాంకింగ్ వంటి వాటిలో ఉండే ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమిటంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఈ కార్డును ఉపయోగించి 25 శాతం రాయి తిని పొందవచ్చు. అలాగే రైళ్లలో దిగువ బెర్త్ లను పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ మరియు పోస్ట్ ఆఫీస్ లో వీరు డిపాజిట్ చేసుకున్న డిపాజిట్లపై సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను మినహాయింపు ,కోర్టు కేసుల విచారణ తేదీల కేటాయింపులో కూడా ఈ కార్డు వృద్ధులకు ఉపయోగపడుతుంది.
వృద్ధాశ్రమాలలో కూడా సేవలు పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది.
ఈ కార్డు లో ఏమేమి ఉంటాయి:
ఈ కార్డు నందు ఆ వృద్ధుని యొక్క ముఖ్యమైన సమాచారాలు కలిగి ఉంటుంది. అంటే అభివృద్ధిని యొక్క బ్లడ్ గ్రూప్ మరియు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ కార్డును ఎలా పొందగలం:
ఈ కార్డు పొందుటకు వృద్ధుని యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి వృద్ధుని యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం కుల
ధ్రువీకరణ పత్రం మరియు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ ఫోన్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సమాచారమంతా సరిగ్గా ఉంటే కేవలం 10 నిమిషాల్లోనే కార్డు మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ కార్డు ఉపయోగించడం వలన ఇతర గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
అత్యవసర సమయాల్లో వృద్ధుల యొక్క సమాచారం తెలుసుకొనుటకు ముఖ్యమైన సాధనంగా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన వృద్ధులకు ఎంతో మంచి జరుగుతుంది.