హ్యాపీ హోలీ(Festival) సంబరాలు

HOLI(Festival)

హోలీ పండుగను మన ప్రాచీనుల ప్రకారం వసంతోత్సవ పండగ అంటారు. ఇది భారతదేశంలో వసంత ఋతువు ఆగమనంలో జరుపుకునే పండుగ.

హోలీ పండుగను రాధాకృష్ణుల సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సానా, బ్రజ్ లలో ఘనంగా జరుపుకుంటారు.

స్నేహం వృద్ధికీ, ప్రేమ వికసించడానికీ, ఇతరులను కలవడానికీ, బంధాలు బలపడడానికీ, ఆడుకోవడానికీ, నవ్వడానికీ, పగ ప్రతీకారం, ద్వేషం మరిచిపోవడానికీ, క్షమించడానికీ, విచ్చిన్నమైన సంబంధాలను సరిదిద్దుకోవడానికీ, జరుపుకునే పండుగ ఈ వసంతోత్సవం.

హోలీ పండుగకు హానికరమైన రసాయన రంగుల కన్నా, వసంత ఋతువులలో విరగబూసిన పూలూ,ఆకులూ మరీ ముఖ్యంగా మోదుగు పువ్వుల రంగు నీళ్లను వాడటం వల్ల చర్మంపై ఉన్న టాక్సిన్స్ పోతాయి చర్మ రోగాలు రావు

భారత దేశ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది.

అయితే నేటి సమాజంలో హోలీ సంబరాలు మారుతున్న తీరు కొన్ని అవకతవకలకు దారితీస్తుంది ఆనందాన్ని కలిగించే ఈ పండుగ కొన్నిసార్లు సమాజములో ప్రతికూల ప్రభావాలను సృష్టిస్తుంది


హోలీ పండుగ కొన్ని జాగ్రత్తలు:-

జల సంరక్షణ: నీటి వినియోగాన్ని తగ్గిస్తూ పొడి హోలీ (డ్రై హోలీ )ని ప్రోత్సహించాలి

ప్రకృతి నుంచి వచ్చే రంగులను ప్రోత్సహించి రసాయనిక రంగులను తగ్గించాలి

సాంస్కృతిక మార్గదర్శకాలు: హోలీ ని మద్యం, అసభ్యత లేకుండా స్వచ్ఛంగా జరుపుకోవడానికి సమాజంలో అవగాహన కల్పించాలి

మహిళల రక్షణ: హోలీ వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

హోలీ పండుగ మన సాంస్కృతికి ఆనందానికి ప్రతీక హోలీ అసలైన హింస కాలుష్యం అసభ్యత లేకుండా జరుపుకోవడం మన బాధ్యత

రంగులు మన హృదయాలను కలిపేలా ఉండాలి మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు

ఈ హోలీ పండుగ మీ జీవితంలో ప్రేమ అనురాగాలను శాంతి సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు నీకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

Leave a Comment