అమరావతిని పునరుత్పాదక నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యo

By Priya Raj

Updated On:

Join WhatsApp

Join Now


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయిన అమరావతిని మరింత హంగులతో తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగానే పునరుత్పాదక శక్తితో నడిచే నగరంగా తీర్చిదిద్దామనుకుంటుంది. అమరావతిని పునరుత్పాదక శక్తితో నడిచిన నగరంగా తీర్చిదిద్దడానికి గాను మొత్తం ఎంత విద్యుత్ అవసరమవుతుంది అంటే 2700 మెగావాట్లు అవసరమవుతాయి.

అందుకుగాను మొత్తం విద్యుత్ అవసరాలు సౌర వాయు మరియు జల విద్యుత్ వంటి పునర్ ఉత్పాదక శక్తి వనరుల ద్వారా మాత్రమే తీర్చబడతాయి. ఈ విధంగా జరిగినట్లయితే అమరావతి నగరం శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా ఉంటుంది. దీనివలన అమరావతి నగరాన్ని కార్బన్ న్యూట్రల్ నగరంగా నిలిపేందుకు దోహదపడుతుంది.


ఈ ప్రాజెక్టులోని ప్రధాన లక్షణాలు :

1 పునరుత్పాదక శక్తి లక్ష్యం:

  • 2700 మెగావాట్ల విద్యుత్తులో 2050 నాటికి కనీసం 30% అయినా సౌర మరియు పవనశక్తి నుండి లభిస్తుంది.
  • ఈ విద్యుత్ అవసరాలకు గాను ప్రభుత్వ భవనాలలో రూప్ టాప్ సోలార్ ప్యానల్ లను తప్పని
    సరి చేస్తుంది. అలాగే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు అమలు చేయబడతాయి.
  • 2 స్థిరమైన మౌలిక సదుపాయాలు:
  • ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో భాగంగా మెట్రో మరియు ఎలక్ట్రిక్ బస్సులు పునరుత్పాదక శక్తితో నడుస్తాయి.
  • ఇది చార్జింగ్ స్టేషన్ దీనికిగాను ప్రజ లు ఎక్కువగా తిరిగే ప్రదేశా ల్లో వీటిని ఎక్కువగా ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.
  • స్మార్ట్ గీత్ సాంకేతికత అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నెట్వర్క్ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు.

  • 3 పర్యావరణ అనుకూల నగర ప్రణాళికలు:
    కృష్ణానది ఒడ్డున 217 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు.
    పార్కులు మరియు నడక మార్గాలు అలాగే బస్ డిపో వంటి ప్రదేశాలలో సోలార్ టాపింగ్ సామర్థ్యం పెంచబడుతుంది.
    మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 65 వేల కోట్లు కాగా విజయవాడ మరియు గుంటూరు ప్రాంతంలో 8,352 చదరపు కిలోమీటర్ల భూమిని రాజధాని ప్రాంతంగా మార్చడానికి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది.

Leave a Comment