ఏపీలో డీఎస్సీ కోచింగ్ ఉచితం

By Priya Raj

Updated On:

Join WhatsApp

Join Now

ఏపీలో డీఎస్సీ కోచింగ్ ఉచితం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నది అందులో భాగంగానే అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ను ఇస్తూ ముందుకు వెళుతుంది. దీనిలో భాగంగానే బీసీ అభ్యర్థులకు డీఎస్సీ కోచింగ్ ను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు   తెలుసుకుందాం.


ఏపీ ప్రభుత్వం బీసీ అభ్యర్థులకు సువర్ణ అవకాశం కల్పించింది. ఉచిత డీఎస్సీ ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని అందించాలని ఉద్దేశంతో ఈనెల అనగా 24 ఏప్రిల్ 2025 నా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవిత గారు ప్రకటించారు. దీనికి సంబంధించి సవిత గారి అధికారిక కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా రాష్ట్రంలోనే 26 జిల్లా కేంద్రాల్లో జరగనుంది.

ఈ అవకాశాన్ని బీసీ అభ్యర్థులు వినియోగించుకోవాలని ప్రభుత్వ ఉద్దేశం.
ఈ కార్యక్రమం ద్వారా బీసీ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను సాధించాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని మంత్రి సవిత గారు చెప్పారు.

ఇందులో భాగంగానే 5200 మందికి ఉచిత శిక్షణతో పాటు 1500 స్టైఫండ్ మరియు అధ్యయన మెటీరియల్ కొరకు 1000 కూడా ఇస్తారు. మొత్తం ఒక అభ్యర్థికి 2500 ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని Statistics సద్వినియోగం చేసుకోగలరు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతి యువకులకే కాకుండా గృహిణులకు మరియు ఇతర అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆన్లైన్ ద్వారా కూడా ఈ ట్రైనింగ్ ను అందించనుంది. ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్టు మంత్రి సవిత గారు వెల్లడించారు.

డి ఎస్ సి అనే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ జూన్ 6 నుండి జూలై 6 వరకు జరగనుంది.

ఈ ఉచిత కోచింగ్ అనే కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కొరకు బీసీ స్టడీ సర్కిల్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. టిడిపి ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాల్లో భాగంగా విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలో 1.80 లక్షల ఉపాధ్యాయుల పోస్టులనుభర్తీ చేసింది. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో కౌన్సిలింగ్ విధానాన్ని కూడా టిడిపి ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా కవిత గారు చెప్పడం జరిగింది.

దీని ద్వారా ఏపీ ప్రభుత్వం వెనుకబడిన బీసీ అభ్యర్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సవిత గారు ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రభుత్వం ఆశిస్తోంది.

Leave a Comment