Free bus travel for health pensioners – ap

By Priya Raj

Published On:

Join WhatsApp

Join Now

Free bus travel for health pensioners – ap:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకు ఇంకా మంచి జరిగేలా కొత్త కొత్త హామీలను అదే విధంగా కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వీటిలో హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది

Free bus travel for health pensioners – ap ఈ క్రింది వారికి ఇవ్వాలనే ఆలోచన

గుండె జబ్బులు, కిడ్నీ, తల సేమియా, పక్షవాతం, లెప్రసీ, లివర్, సివిఆర్ ఎమోఫిలియా తదితర సమస్యలున్న 51 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పెన్షన్లు పంపిణీ చేస్తుంది. వైద్య చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లి వచ్చేందుకు వారికి అదనపు వ్యయప్రయాసలు తప్పడం లేదు. రాష్ట్రంలో సుమారు 35 వేల మంది వరకున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు ఒకటి, రెండుసార్లు అయినా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వీరిలో పింఛన్ సదుపాయం కొద్ది మందికి అందుతుంది

Free bus travel for health pensioners - ap

ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు 200 నుంచి 600 రూపాయల వరకు భరించాల్సి వస్తుంది. మరికొందరు 108 అంబులెన్స్ సేవలను పొందుతున్నారు, అయితే ఈ అంబులెన్స్ సేవలు అనేవి కేవలం ఆసుపత్రిలో చేరేవరకు మాత్రమే అందుబాటులో ఉండేవి తిరుగు ప్రయాణంలో సొంత ఖర్చులు అనేవి పెట్టుకోవాల్సి వస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం పై  ఆలోచిస్తుంది.

నైపుణ్య గణన సమాచారం – Click Here

ఆంధ్ర ప్రదేశ్ పథకాల పూర్తి సమాచారం – Click Here

Leave a Comment