కొన్ని గంటలలో భూమి పైకి రానున్న సునీత విలియమ్స్
భూమి పై అడుగుపెట్టనున్నఅడుగుపెట్టనున్న సునీత విలియమ్స్
గత 9 నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారి రిట్నర్ జర్నీ గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షెడ్యూల్ వెల్లడించింది.
మార్చి 18న మంగళవారం సాయంత్రం వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి బయలుదేరుతారని తెలిపింది. సునీతా, విల్‌మోర్‌తో పాటు అమెరికా, రష్యాలకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు కలిసి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్‌లో బయలుదేరుతారని పేర్కొంది.
గంగా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌ను శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయోగించగా.. ఆదివారం ఉదయం అది ఐఎస్ఎస్‌కు చేరిన సంగతి తెలిసిందే. 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరినా సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్
8 రోజులపాటు అంతరిక్షంలో ఉండి తిరిగి వీళ్ళిద్దరి భూమ్మీదకి రావాలి కానీ స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలతో అంతరిక్షంలోనే విండిపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్
క్రు 9 ఆటంకం కలిగి అక్కడే ఇరుకున్నారు.
రేపో మాపో అంటూ 284 రోజులు అంతరిక్షములో ఉండిపోయిన సునీత విలియమ్స్
సునీత విలియమ్స్ గురించి కొన్ని విషయాలు
సునీత అమెరికా లోని ఒహాయో రాష్ట్రం లో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికా లోని నవల్ అకాడెమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.
తండ్రి సూచనతో నౌకాదళం లో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా చేరింది. నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 విమాన ( ఫ్లైట్ అవర్స్) గంటల అనుభవం గడించింది..
నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానం లో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో గడిపింది.
అంతరిక్షం లో గడిపిన 322 రోజులలో ఒక రోజు కూడా వ్యాయామం మానలేదు. అంతరిక్ష మొదటి ప్రయాణం లో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం వంటివి చేసింది. రెండవ సారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు జరిపింది.
సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ అవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే “నాసా ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్” బృందం తో కలిసి పని చేసింది.
సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, NASA వ్యోమగామి . అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983 లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987 లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తరువాత జూలై 1989 లో ఆమె యుద్ధ హెలికాఫ్టర్ శిక్షణను పూర్తిచేశారు.
పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహాక కార్యక్రమాలలో , ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్‌ల స్థాపనలో, అలాగే 1992 లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఈవిడ పాల్గొన్నది.
మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా-స్పేస్ ఎక్స్ లో తాజాగా క్రూ-10 మిషన్ ను చేపట్టాయి.
నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 10 రాకెట్.. సునీతా విలియమ్స్ రాక మరి కొన్ని గంటలలో:
సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సునీతతోపాటు బుచ్ తిరిగి రావడానికి క్రూ-10 మిషన్ ప్రారంభించింది నాసా-స్పేస్ ఎక్స్. . సునీత, బుచ్ 8 రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అంతరిక్ష నౌకలో కొంత సాంకేతిక లోపం కారణంగా, గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వారు భూమికి తిరిగి రావడానికి ఎదురు చూస్తోంది.
2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరినా సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్
8 రోజులపాటు అంతరిక్షంలో ఉండి తిరిగి వీళ్ళిద్దరి భూమ్మీదకి రావాలి కానీ స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలతో అంతరిక్షంలోనే విండిపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్
రేపో మాపో అంటూ 284 రోజులు అంతరిక్షములో ఉండిపోయిన సునీత విలియమ్స్
సునీత బుచ్ విల్మర్ కోసం నాసా ఈ సారి గట్టి ప్రయత్నం చేసింది
ఎట్టకేలకు స్పేస్ క్రూ 10 రాకెట్ ను విజయవంతం గా నింగి లోనికి పంపించారు.
క్రూ 10 లో నలుగురు వ్యోమగాములు వెళ్లడం జరిగింది
ఆనందంలో సునీత విలియమ్స్ బుచ్ స్టెప్ లు వేసి ఆ వ్యోమగాము ల ను ఆత్మీయ భావన తో హత్తుకోవడం జరిగింది.
రేపు కల్పనా చావ్లా పుట్టినరోజు సందర్బంగా సునీత విలియమ్స్ భూమి మీద కు రావడం తో
మళ్ళీ కల్పనా చావ్లా బ్రతికి వచ్చారు అని ప్రపంచం లో పండగ వాతావరణం కనిపిస్తుంది.
మరి కొన్ని గంటల్లో భూమి మీద కు రాబోతున్న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ కు “తల్లి కి వందనం.ఇన్”(tallikivandanam.in) నుండి నా హృదయ పూర్వక ఆహ్వానం.