రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక
మన ప్రభుత్వం ప్రతినెల రేషన్ బియ్యం కందిపప్పు చక్కెర ఇవ్వడం జరుగుతుంది
అయితే ఇక మీదట రేషన్ ఏప్రిల్ నుండి రాదు అని అధికారులు చెబుతున్నారు
అస్సలేందుకు రేషన్ రాదు:
మన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అది ఏమిటంటే ఇప్పుడు ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ (e-KYC) పూర్తి చేసుండాలి.
ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో ఏప్రిల్ ఒకటో తేదీ రేషన్ నిలిపివేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ప్రతి ఒక్కరూ (e-KYC) తప్పకుండా చేయించుకోవాలి.
రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఈ కేవైసీ(e-KYC) కంపల్సరిగా చేయించుకోవాలి.
ఇప్పటివరకు ఈ కేవైసీ లేకపోయినా సరే రేషన్ బియ్యం ను ప్రభుత్వ అందజేసింది. తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకుని ఉండాలి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కేవైసీ రేషన్ ఇవ్వడం జరగదు. వెంటనే రేషన్ దారులు గ్రామ/వార్డ్ సచివాల సచివాలయ సిబ్బందిని కలిసి సంప్రదించి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది.
రేషన్ పంపిణీ లా కోసం సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ కేవైసీ చేసుకొని ఉంటారో వారి యొక్క లిస్టు రేషన్ డీలర్లకు ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ కేవైసీ ప్రాసెస్ ను ఇంటింటికి వెళ్లి చేయడం మొదలుపెట్టారు.
ఈ కేవైసీ పూర్తయిన తరువాత రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్లి వేలిముద్ర వేయించుకొని అప్డేట్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి మాత్రమే రేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి ఒక్క రేషన్ దారులు ఈ ప్రాసెస్ ను కచ్చితంగా చేయాలని అధికారులు చెప్పడం జరిగింది.
ఎవరికైతే ఈ కేవైసీ లేదో వారి లిస్టును రెడీ చేస్తున్నారు. ఈ కేవైసీ చేయనివారు 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న వారందరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఏమైనా తెలియకపోతే సిబ్బందిని అడిగి తెలుసుకోవలసిందిగా అధికారులు తెలియజేయడం జరిగింది.
ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని మంత్రులు చెప్పడం జరిగింది. మంత్రి నాదేండ్ల మనోహర్ ధాన్యంలో తేమశాతం 17% నుంచి 20% ఉండేలా కొనుగోలు చేయాలి అని తెలిపారు.
ఏప్రిల్ ఒకటో తేదీ లోపు ఈ కేవైసీ చేయించుకొని ఎడల రేషన్ పొందే అవకాశాన్ని కోల్పోవచ్చు. వీలైనంత త్వరగా కేవైసీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది.