AP Ration card 2024: కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మరియు ఇతర సంక్షేమ పథకాలను ప్రారంభించుటకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పెన్షన్లు పెంపు, మెగా డీఎస్సీ పై కస్తరత్తు, ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగాలకు జీతాలు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ వద్దు మొదలైన కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.
మీ రేషన్ కార్డ్ లో ఎంతమంది ఉన్నారో తెలుసుకొనుటకు – Click Here
వీటితోపాటు రేషన్ కార్డు సేవలను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగి రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు , ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులను మార్పులు చేర్పులు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రేషన్ కార్డు సేవలకు సంబంధించి వచ్చే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
రేషన్ కార్డు సంబంధించి అందించే సేవలు
- కొత్త రేషన్ కార్డులు జారీ.
- రేషన్ కార్డులో కుటుంబాలు విభజన.
- రేషన్ కార్డులో సభ్యులు చేర్పు.
- రేషన్ కార్డులో సభ్యులు తొలగింపు.
- రేషన్ కార్డులో అడ్రస్ మార్పు.
- రేషన్ కార్డులను సరెండర్ చేయడం.
కొత్త రేషన్ కార్డులు జారీ: ఏ రేషన్ కార్డులో లేకుండా వున్న వారు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డులను పొందుటకు కావాల్సిన అర్హతలు ప్రభుత్వం విడుదల చేయలేదు దానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రభుత్వం రేషన్ కార్డులు సంబంధించి అర్హతలు ప్రమాణాలు విడుదల చేసిన తర్వాత అర్హత గల అభ్యర్థులు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.
రేషన్ కార్డులో కుటుంబాల విభజన : కే రేషన్ కార్డులో రెండు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు కలిగి వున్న వారు సపరేట్ రేషన్ కార్డు కొరకు రేషన్ కార్డుల కుటుంబాలు విభజన ద్వారా సపరేట్ రేషన్ కార్డు పొందవచ్చు.
రేషన్ కార్డు లో సభ్యులు చేర్పు : రేషన్ కార్డులో కొత్తగా పెళ్లయిన వారు, పిల్లలు, ఇతరులు ఒకరేషన్ కార్డు లో యాడ్ అగుటకు రేషన్ కార్డులో సభ్యులు చేర్పు ద్వారా సేవలు పొందవచ్చు.
రేషన్ కార్డు లో సభ్యులు తొలగింపు: రేషన్ కార్డులో మరణించిన సభ్యులను, ఇతరులను రేషన్ కార్డులో సభ్యులు తొలగింపు ఆప్షన్ ద్వారా సేవలు పొందవచ్చు.
రేషన్ కార్డు లో అడ్రస్ మార్పు : రేషన్ కార్డులో తప్పుగా ఉన్న అడ్రస్ ని మార్చుకోవడం, మరొక ప్రాంతంలో నివాసం ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి రేషన్ కార్డును అడ్రస్ మార్చుకోవడం మరే ఇతర కరెక్షన్ లు ఉన్నా రేషన్ కార్డులు అడ్రస్ మార్పు ఆప్షన్ ద్వారా సేవలు పొందవచ్చు.
కార్డులను సరండర్ చేయడం : రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేట్లయితే మరియు రేషన్ కార్డు వద్దనుకున్న వారు రేషన్ కార్డులను సరౌండర్ చేయవచ్చు.
గమనిక: ఈ రేషన్ కార్డు సేవలో సంబంధించి ప్రభుత్వ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అనగా ఈ సేవలు పొందడానికి అర్హతలు ప్రమాణాలు, విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేయలేదు విడుదల చేసిన వెంటనే మన వెబ్సైట్ నందు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.
ఉచిత గ్యాస్ సిలీండర్ల పథకం – Click Here