హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం
హెల్మెంట్ లేని వారికి వెయ్యి రూపాయలు ఫైన్.
ప్రజలలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం వలన గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
2020 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైన్ వసూలు చేస్తున్నామని అనిత చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గర్లో మాత్రమే ఇది వసూలు చేయడం జరుగుతుంది.
గత నాలుగు సంవత్సరాలలో ఇప్పటికీ ఎన్నో ఆక్సిడెంట్లు మనకు చూసే ఉంటాము.
మనం కరెక్ట్ గా వెళ్తున్న అవతలివారు కరెక్ట్ గా రాకపోవడంతో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
గత నాలుగు సంవత్సరాల్లో ఇప్పటికీ 29,518 యాక్సిడెంట్లు జరిగాయి.
YEAR | ACCIDENTS |
2021-2022 | 7500 |
2022-2023 | 7600 |
2023-2024 | 7516 |
2024-2025 | 6902 |
29518 |
ఇందులో హెల్మెట్ లేకపోవడం వలన 12122 ఆక్సిడెంట్లు జరిగాయని మనం చెప్పొచ్చు.
YEAR | WITH OUT HELMET ACCIDENTS |
2021-2022 | 2577 |
2022-2023 | 3042 |
2023-2024 | 3103 |
2024-2025 | 3400 |
12122 |
ప్రజలలో అవగాహన లేకపోవడం వలన చిన్న పిల్లలకే బైక్ డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ లేకపోయినా సరే వారిని వదిలేయడం. మొదట తల్లిదండ్రులకి జ్ఞానోదయం చేయాలి.
చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తారో వారు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందిగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.
ఇది కేవలం ప్రజల్లో భయాన్ని నిలపడం కోసం మాత్రమేనని హోంమంత్రి అనిత గారు స్పష్టం చేయడం జరిగింది.
వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలని కాదు కేవలం జాగ్రత్త కోసం మాత్రమే.
ఇలా అయినా సరే యాక్సిడెంట్లు లు అయినా ప్రాణం మీదకు రాకుండా కొంతవరకు తగ్గించవచ్చు అని ఆమె చెప్పడం జరిగింది.
ప్రజలలో అవగాహన కల్పించి వారి ప్రాణాలను వారే నిలబెట్టుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తే ఎలాంటి రిస్కులు జరగకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు.
అతివేగం అతి ప్రమాదకరమని తెలిసికూడా ప్రజలలో ఎలాంటి మార్పు అనేది రావడం లేదు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వలన ఆక్సిడెంట్ అవ్వడం దాని ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డుమీద ఉన్నాయి.
వీటిని అరికట్టాలి. రాష్ డ్రైవింగ్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, వీటి అన్నిటికీ గవర్నమెంట్ ఫైన్ తీసుకోవడం జరుగుతుంది.
ప్రతి ఒక్క ఏరియా లో సీసీ కెమెరా లు పెట్టి, 24X7 పోలీస్ లను అందుబాటులో పెట్టిన కూడా ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి.
ప్రజలు ఇకమీదటైనా జాగ్రత్తగా ఉండాలని నిదానంగా వెళ్లాలని చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇవ్వకుండా పెద్దవారు డ్రైవ్ చేస్తున్న హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది.