Skip to content
తల్లికి వందనం

ఆంధ్రప్రదేశ్ లో నేడు జరగనున్న అత్యంత కీలకమైన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు(chandra babu) కొత్త ఏడాదిలో వివిధ వివిధ పథకాల గురించి మంత్రులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి వందనం అమలుతోపాటు పలు అంశాలపై చర్చించారు.
తల్లికి వందనం సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల సమయంలో కీలకమైన తల్లికి వందనం ‘మే నెలలో అమలుపరచడానికి ప్రభుత్వం అతి వేగంగా అడుగులు వేస్తుంది. తల్లికి వందనం స్కీమ్ ని మే నెలలో అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థులకు ఏడాదికి *’15 వేల’* చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది.

ఈ తల్లికి వందనం సాయం అనేది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు.
ఉన్న ప్రభుత్వం అమ్మ ఒడి పథకమనేది కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అయితే ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సాయం అందజేయనున్నారు.
దీంతో ప్రజలలో ఆనందం వెలకట్టలేనిదిగా చెప్పొచ్చు.