ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ Half Day Schools 2025

ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

Half Day Schools 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచో తెలుసా?

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం

ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.

AP Half Day Schools Time table 2025 

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లకు మార్చి15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30 గంటల వరకు విద్యాసంస్థలు కొనసాగుతాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి.

 

 లాస్ట్ వర్కింగ్  డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాతాయని పేర్కొంది. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఏప్రిల్‌ 24 నుంచి సమ్మర్‌ హాలిడేస్‌?

వేసవి సెలవుల (Summer Holidays) : ఏప్రిల్‌ 24 నుంచి ఈసారి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 20- 25 నుంచి స్కూళ్లకు వేస‌వి సెల‌వులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే.. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వరలో వేసవి సెలవులపై కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు మాత్రం వేసవి సెలవులు తగ్గనున్నాయి. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 39 రోజుల వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మార్చి 19న, రెండో ఏడాది పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి 23 వరకూ వచ్చే విద్య సంవత్సరానికి సంబంధించిన తరగతులు ప్రారంభమవుతాయి.

Leave a Comment