ఈ రోజు నుండే టెన్త్‌ పరీక్షలు

ఈ రోజు నుండే టెన్త్‌ పరీక్షలు

Mar-17-2025

 

6,49,884 మంది పదో తరగతి విద్యార్థులు:

పదో తరగతి పరీక్షలు (సోమవారం) ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నా జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,875 మంది విద్యార్ధులు హాజరు అయ్యారు.

బాలురు 3,36,201 మంది, బాలికలు 3,13,609 మంది ఉన్నారు. ఈ నెల 31వ తేది వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు.

 

ఈ నెల 31వ తేదిన ఒకవేళ రంజాన్‌ అయితే ఏప్రిల్‌ 1వ తేదిన సోషల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 163 సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసింది.

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది. విద్యార్ధులు హాల్‌ టిక్కెట్లు చూపించి ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ పరీక్షల విభాగ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే 0866-2974540 నెంబర్‌కు గానీ, ఏప్రిల్‌ 3 నుంచి 9వ తేది వరకు పేపర్‌ మూల్యాంకనం 26 జిల్లా కేంద్రాల్లో జరగనుంది.


మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి
పదవ తరగతి విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని, విద్యార్ధులు వారి హాల్‌ టిక్కెట్‌ను చూపించి ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేదిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాము అన్నారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని
పదవ తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు రాయాలని బిసి వసతి గృహ విద్యార్ధులతో పాటు ఇతర విద్యార్ధులకు బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత సూచించారు.

ఈ పదవ తరగతి పరీక్షలలో కూడా ఎంజెపి స్కూళ్లు, బిసి వసతి గృహాల విద్యార్ధులు సత్తా చాటాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్ధి జీవితంలో పదవ తరగతి పరీక్షలు ఒక మెయిన్ టాస్క్ గా ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని మంత్రి సూచించారు.

విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం చంద్రబాబు

పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ప్రయాణంలో ఈ పరీక్షలు మైలురాయి అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ కూడా విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంతంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావొద్దని సూచించారు.

Leave a Comment