ISRO చంద్రయాన్-5
చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లారని, అయితే చంద్రయాన్-5 ద్వారా 250కేజీల బరువున్న రోవర్ చంద్రుడి మీదకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్..
త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టు గురించి ఆయన తెలిపారు ..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌గా నారాయణన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను సత్కరించడం జరిగింది.
25 కిలోల బరువున్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను మోసుకెళ్లిన చంద్రయాన్-3 మిషన్ మాదిరిగా కాకుండా, చంద్రయాన్-5 మిషన్ చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి 250 కిలోల రోవర్‌ను మోసుకెళ్తుందని అన్నారు. 2008లో విజయవంతంగా ప్రయోగించబడిన చంద్రయాన్-1, చంద్రుని యొక్క రసాయన, ఖనిజ మరియు ఫోటో-జియోలాజిక్ మ్యాప్‌లను తయారు చేసింది. 2019లో చంద్రయాన్-2 మిషన్ చంద్రుని ఉపరితలంపైకి దూసుకెళ్లడంతో ముగిసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని హై-రిజల్యూషన్ కెమెరా వందలాది చిత్రాలను పంపిందని నారాయణన్ అన్నారు.
చంద్రయాన్-3 మిషన్ చంద్రయాన్-2 కు కొనసాగింపుగా, చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్, సంచరించడంలో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. ఇది ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా సాఫ్ట్-ల్యాండ్ చేయగలిగింది.
చంద్రయాన్-5 మిషన్‌కు ఆమోదం:
మూడు రోజుల క్రితం, చంద్రయాన్-5 మిషన్‌కు తమకు ఆమోదం లభించిందని, తాము జపాన్‌తో కలిసి దీనిపై పనిచేయనున్నట్లు నారాయణన్ తెలిపారు.
చంద్రయాన్-4 మిషన్ 2027లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. చంద్రుని నుండి చంద్రుని నేల నమూనాలను సేకరించి, తదుపరి అధ్యయనం కోసం భూమికి తిరిగి తీసుకురావడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రో భవిష్యత్ ప్రాజెక్టుల గురించి, గగన్‌యాన్‌తో సహా వివిధ మిషన్‌లతో పాటు, భారతదేశానికి భారతీయ అంతరిక్ష్ స్టేషన్ అని పిలువబడే స్వంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నారాయణన్ అన్నారు.
చంద్రయాన్-5 ఇదివరకటి మిషన్‌ల కంటే అత్యంత ప్రత్యేకమైందని ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి 2023లో ప్రయోగించిన చంద్రయాన్-3 25 కిలోల బరువున్న ‘ప్రజ్ఞాన్’ రోవర్‌ను మోసుకెళ్లగా.. చంద్రయాన్-5 ఏకంగా 250 కిలోల రోవర్‌ను మోసుకెళ్తుందని అన్నారు. మూడు రోజుల క్రితమే మాకు చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని.. జపాన్‌తో కలిసి ఈ ప్రయోగం నిర్వహిస్తామని నారాయణన్ వెల్లడించారు.
చంద్రయాన్-4 లాంచింగ్ అప్పుడే..
2027లో చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుని నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ISRo భవిష్యత్తులో గగన్‌యాన్ సహా వివిధ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడమూ ఈ మిషన్లలో ప్రధానమైనది.
ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు..
చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు వరస చంద్రయాన్ ప్రయోగాలు చేపడుతోంది ఇస్రో.2008లో తొలిసారి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-1 చంద్రుని రసాయన, ఖనిజ, ఫోటో-జియోలాజిక్ మ్యాపింగ్‌ను తీసుకుంది. చంద్రయాన్-2 మిషన్ (2019) 98 శాతం విజయవంతమైంది. చివరి దశల్లో కేవలం రెండు శాతం అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడమే కారణం.
అయితే, ఇప్పటికీ చంద్రయాన్-2 లోని ఆన్‌బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరా వందలాది చిత్రాలను పంపుతోందని ఇస్రో చీఫ్ నారాయణన్ స్వయంగా తెలిపారు. ఇక తర్వాత ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయం. ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా ‘సాఫ్ట్-ల్యాండింగ్’ చేసి చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేసింది ఇస్రో. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే ఈ ప్రయోగ ఉద్దేశం.