మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
మన చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువత కోసం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల సంఖ్య అధిక మొత్తంలోనే ఉందని చెప్పవచ్చు. అందుకుగాను మన కూటమి ప్రభుత్వము నిరుద్యోగుల భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి స్కూల్ రీ ఓపెన్ సమయానికి అన్ని పూర్తయ్యే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ లో 16,371 పోస్టులను టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది.
మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం నిరుద్యోగుల మీద దృష్టి పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఇది ఒక బంగారు అవకాశం గా చెప్పుకోవచ్చు. డీఎస్సీ ద్వారా 16,371 ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
ఏప్రిల్ నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు టీచర్ల పోస్టులు నా అతి త్వరలోనే ఇస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది.
స్కూల్ రీ ఓపెన్ టైం కి స్కూల్ కి సంభందించిన పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పూర్తి చేయిస్తామని, స్కూల్ లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బాత్రూమ్స్ మరియు స్కూల్ కి అవసరమైన ఫర్నిచర్ వీటి అన్నిటి కోసం మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు మౌలిక సదుపాయాల కోసం మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది.
డీఎస్సీ ద్వారా 16,371 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం వీరిలో
6371 సెకండరీ గ్రేడ్ టీచర్స్
7725 స్కూల్ అసిస్టెంట్
1781 ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్లు
132 వ్యాయామ టీచర్ల పోస్టులు
286 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు
52 ప్రిన్సిపల్ పోస్టులు
ఇవ్వడం జరుగుతుంది.
మెగా డీఎస్ కు సంబంధించిన సిలబస్‌ను కూడా ఇవ్వడం జరిగింది.
మన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పిన విధముగా ఉద్యోగాలను మొదటి దశలోనే పూర్తి చేసుకోవడం నిరుద్యోగ యువతకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పవచ్చు.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేనెల మొదటి వారంలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది.