ఇకపై ప్రైవేట్ స్కూల్స్ లో కూడా సామాన్యులు ఉచిత విద్యను పొందే అవకాశం

(RET) ప్రకారం 2025 -26 సంవత్సర సంవత్సరానికి గాను పేద విద్యార్థుల సైతం
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించాలి అని ఉద్దేశంతో ప్రభుత్వం 25% ఉచిత ప్రవేశాలకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

2025- 2026 విద్యా సంవత్సరం
కూటమి ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉండే పేద కుటుంబాల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది.

విద్యా హక్కు చట్టం ప్రకారం 2025 26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాలకు గాను ఒకటో తరగతి ప్రవేశాలకు ఈనెల అనగా ఏప్రిల్ 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

జిల్లాలో మొత్తం 491 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన విద్యార్థుల ప్రాథమిక వివరాలతో cse. ap. gov. in అనే వెబ్సైట్లో అవసరమైన మరియు ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తుదారుల ప్రస్తుత చిరునామా కోసం
1. తల్లిదండ్రుల ఆధార్ ,
2. ఓటర్, కార్డు,
3. రేషన్ కార్డు,
4. భూమి హక్కుల పత్రం,
5. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు,
6. పాస్పోర్ట్,
7. డ్రైవింగ్ లైసెన్స్,
8. విద్యుత్ బిల్లు ఒప్పంద పత్రాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు,
9. పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది.

ఐబి సీబీఎస్ఈ ఐ సి ఎస్ ఈ సిలబస్ గల పాఠశాలలో ప్రవేశాల కోసం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఐదేళ్ల వయస్సు ఉండాలి.అలాగే స్టేట్ సిలబస్ పాఠశాలలో ప్రవేశాలకు జూన్ 1 నాటికి ఐదేళ్లు పూర్తి అయిన పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గ్రామం మరియు వార్డు సచివాలయాల డేటా ప్రకారం 2025 మే 16 నుంచి 2025 మే 20 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనికిగాను ప్రభుత్వం
మొదటి విడత ఫలితాలను లాటరీ విధానంలో మీ 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తుంది. సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2వ తేదీన ఫైనల్ చేస్తారు. అలాగే రెండో విడత ఫలితాలను జూన్ 6న విడుదల చేస్తారు.

ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అందుకుగాను ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది.

అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ వార్షికోత్సవాలను నిర్వహించాలని మొదటిగా నిర్ణయించారు.ఇందులో భాగంగానే కేవలం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడమే కాకుండా చదువులో ముందంజలో ఉండే విద్యార్థులకు బహుమతులు అందిస్తారు.