ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం తీపి కబురు.

By Priya Raj

Published On:

Join WhatsApp

Join Now

ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించిన వాగ్దానాలలో ఒకటైన పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు.

a person's hand holding a house


అందులో భాగంగానే మూడు లక్షల మందికి పైగా ఇల్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. జూన్ 12 లోగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనుంది. అంటే మరో రెండు నెలల్లో మొత్తం మూడు లక్షల మందికి పైగా టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అర్హులకు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది.


ఇదివరకే ఇళ్ల పంపిణీ ప్రభుత్వం చేయాలనుకున్నా కానీ కార్యరూపం దాచలేకపోయింది. అంటే ఫిబ్రవరి ఒకటే తేదీనే 1.14 లక్షల సామూహిక ఇళ్ల ప్రారంభ ప్రారంభోత్సవాలు చేయలేకపోయింది.దీనికి కారణం ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ రావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు . ఈలోగా వివిధ దశలో వివిధ కారణాలు చేత నిర్మాణం ఆగిపోయిన 1.70 లక్షల ఇల్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. ఇంకో 60 వేల ఇళ్లను పూర్తిచేసే సమయం ఉండడంతో ప్రభుత్వం పనులను వేగవంతం చేశారు.


ఈ మూడు లక్షల ఇళ్లను సామూహిక ప్రారంభత్సవాలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు ఇంకా సొంత ఇంటి కల నెరవేరని అభ్యర్థులను గుర్తించి పట్టణ ప్రాంతాల్లోని పేదలైన అర్హులకు రెండు సెంట్లు, అలాగే గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది. అందులో నాణ్యమైన ఇళ్ళను నిర్మించి అర్హులకు ఇచ్చేందుకు సిద్ధమైంది.


గత ప్రభుత్వ సమయంలో అసంపూర్తిగా నిర్మాణం జరిగిన ఇళ్ళను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం 300 కోట్ల నిధులను విడుదల చేసింది.


అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర సబ్సిడీ కింద 1.87 లక్షల రూపాయలను ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పూచికత్తుతో స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా మరో 35 వేల రుణాన్ని అందచేయాలని ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఎస్సీ బీసీ లబ్ధిదారులకు రూ. 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75000, ఆదివాసి గిరిజన లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున అదనపు సహాయం అందించేందుకు ప్రభుత్వం మరో రూ .202 కోట్లు విడుదల చేసింది.


వీటన్నిటిని నిర్వహించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అన్నిటినీ సిద్ధం చేస్తుంది.

Leave a Comment