గవర్నమెంట్ స్కూల్స్ ఆ మజాకా…

By Priya Raj

Updated On:

Join WhatsApp

Join Now

గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్నో కొత్త మార్పులను తీసుకొస్తున్న మన ప్రభుత్వం.

ఈరోజుల్లో గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయ్యే విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గవర్నమెంట్ టీచర్ల పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించడం మనందరికీ తెలిసిన విషయమే.

 కానీ నిజానికి ప్రైవేట్ స్కూల్లకు ఏమాత్రం కూడా తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింట్లో ముందు ఉన్నది. తాజా ఫలితాలను పరిశీలించినా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు కూడా ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్ధులకి ధీటుగా అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలలు ఉన్నాయి.

ప్రవేటు పాఠశాలలో విద్యావిధానం

ఈరోజుల్లో కొన్ని ప్రైవేట్ స్కూల్లలో విధ్యా నిర్వహణ మనం చూస్తూనే ఉన్నాం. బరువుకు మించిన పుస్తకాలు, రెస్టు లేని చదువు, ఆటలంటే తెలియదు అన్న స్టేజికి రావడం ఎంతో బాధాకరం.విధ్యార్ధి దశలో చేయాల్సినవి చేయకుండా, ఆడుకున్న టైంలో పిల్లలను ఆడుకోనివ్వకుండా ట్యూ షణ్లకు పంపించి మోయలేని పుస్తకాలు వారి చేత మోయించి, సరైన తిండి లేక పొద్దులోస్తాం చదువు చదువు చదివించడం వలన వాళ్ళ మైండ్ రెస్టు లేకుండా పోతుంది. చిన్న వయసులోనే గుండె నొప్పితో కుప్పకూలి పడిపోవడం. దీనికి కారణం కేవలం రెస్టులేని చదువు. ఉదయం 8 గంటలకు వెళ్ళిన విద్యార్థి సాయంత్రం 6 గంటలకు ఇంటికి రాగానే ట్యూషన్లకు పంపించడం ఇలా విధ్యార్ధి ధశలోనే ఎక్కువ స్టేస్ కి గురి అగుతున్నారు. ఆడుకునే వయసులో ఆడించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

విద్యార్థికి విద్యను అభ్యసించు విదానం

విద్యార్ధి కి అన్నీ రంగాలను పరిచయం చేసి , ఆ విధ్యార్ధి ఏ రంగం లో అయితే ప్రాధాన్యత చూపుతాడో లేదా ఆ విధ్యార్ధి ఏ అంశాలను అభ్యసించుటకు ఎక్కువ ఆసక్తి చూపుతారు గుర్తించి ఆ అంశాలను లేదా ఆ బోధన పద్దతులను పాటించడం ద్వారా ఆ విద్యార్థి విధ్య విధానం మరింత ముందుకు సాగును. ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్లో చదువు ఒక్కటే కాదు అన్ని విద్యలు తెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్ తో విద్యార్థులకు విద్యతోపాటు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చే విధముగా అనేక ఆటలను పిల్లల చేత ఆడిపించడం వారి మానసిక స్థితి మెరుగుపరిచేలా చేయడం తద్వారా వారి విద్యలో ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అనేక రకమైన ఆటలను నేర్పించడం జరుగుతుంది.

విధ్యార్ధులచే ఆడించే కొన్ని రకాల ఆటలు

ఉప్పాట, చీకురు పుల్లాట, నాలుగు రాళ్లట, కోకో, కబడ్డీ, కోతికొమ్మచ్చి, దాన్కునే ఆట (డిమిండల్), బారాలాట, అచ్చంగాయి ఆట, కుర్చీ ఆట, బాలాట, కర్చీఫ్ ఆట, ఇంకా కొత్త రకంగా పిల్లల మేధస్సుకు ఉపయోగపడే విధంగా కొత్త రకం ఆటలను కూడా గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది.ఇలాంటి ఆటలను ఆడించుట ద్వారా వారిలో ప్రధానంగా వారిలో పని ఒత్తిడి తగ్గుతుంది. వీటి తో పాటు పిల్లలు స్నేహా భావం, సమస్యా పరిస్కారం వెతకడం, అన్వేషణ చేయడం, మొదలగు నైపుణ్యాలు ఆ విధ్యా దశలోనే విధ్యార్ధులకి అందడం జరుగును.

దీనితో పాటు గవర్నమెంట్ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లు నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడే విధంగా మంచి ఉపాధ్యాయుల నిర్వహించి విద్యను అందించడం, ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా గవర్నమెంట్ స్కూలు దేనికి కూడా తక్కువ కాదు అని విద్యార్థులను తయారు చేయడం గవర్నమెంట్ స్కూల్లో ముఖ్య ఉద్దేశం

ప్రబుత్వ పాఠశాలల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం దాదాపు 58,950 పాఠశాలలు ఉన్నాయి

వాటిలో ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలలు 44617, 13,249 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, వీటిలో మదరసాలు మరియు 1084 ప్రైవేట్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ పాఠశాలలు ఉన్నాయి.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం మరింత అభివృద్ధి చెందేలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడిలాంటి పథకాలను మార్పు చేయడం జరిగింది.
ఈ పథకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకంలోనూ మార్పులు చేయడం జరిగింది.
ఇలా విద్యా విధానంలో అనేక విధాలుగా దోహదపడుటకు కొన్ని రకాల పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది.

🔴Related Post

1 thought on “గవర్నమెంట్ స్కూల్స్ ఆ మజాకా…”

Leave a Comment