అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్.

అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్.

తిరుపతిలోనూ అమరావతి లోను మాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగింది

విశాఖలో తెదేపా ప్రభుత్వం 2014-19 సంవత్సరంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధం చేయడం జరిగింది. ఇందుకుగాను ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది.

మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మన రాష్ట్రానికి రావడానికి లులు ఒప్పుకుంది.
ఇందుకుగాను క్యాబినెట్ ఆమోదముద్ర ఇవ్వడం కూడా జరిగింది.

ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించనున్న సీఎం.

మన రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణ మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ చేతులు మీదుగా ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది.

మన ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీని ఆహ్వానించడం కోసం మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్తున్నట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు..

రాజధాని అమరావతిలో చేపట్టబోయే ముఖ్యమైనటువంటి పనులకు ఆమోద ముద్ర వేసిన క్యాబినెట్ అమరావతి ఏ విధంగా సమృద్ధి ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి వివరించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా మన ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా మన సీఎం ప్రత్యేకంగా కలవనున్నారు.

ప్రస్తుత సంవత్సరంలో ఎన్నో రకాల పథకాల రాష్ట్రనికి ఏవైతే పెండింగ్లో ఉన్నయో నిధుల జాబితాను తీసుకెళ్తున్నారు.

ఆ నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా మన ముఖ్యమంత్రి అడగడం జరుగుతుంది.

Leave a Comment