ap ration card 2024:ఏపీలో ఎన్నికల, ప్రభుత్వం మారిన దృష్ట్యా రేషన్ కార్డులలో ఎలాంటి అనగా కొత్త రేషన్ కార్డులు జారీ రేషన్ కార్డులు మార్పులు, రేషన్ కార్డులు తొలగించడం ఇలాంటి సేవలను ఇప్పటివరకు ప్రారంభించలేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కొత్తగా పెళ్లయిన వారికి వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం (మారేజ్ సర్టిఫికేట్) ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రేషన్ కార్డులను మార్చి కొత్త కార్డులను ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి వివిధ రేషన్ కార్డులు డిజైన్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.
ap ration card 2024 విధి విధానాలు
గత ప్రభుత్వ కాలంలో ఏ సంక్షేమ పథకం పొందాలి కొన్ని రకాల నిబందనలు విధించడం జరిగింది నిబందనలు ఆధారంగానే పథకాలు వర్తింపు అయ్యేవి. వీటిలో ఈ రేషన్ కార్డు ప్రక్రియ కూడా ఈ విధంగానే ఉండేది. ఉదాహరణకు ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే వారికి ఏ సంక్షేమ పథకం వర్తించదు వాటితో పాటు రేషన్ కార్డుకి కూడా అనర్హుడు, ఇంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండి వారికి గ్రామీణ ప్రాంతాలలో పదివేల జీతం పట్టణ ప్రాంతాల వారికి 12,000 జీతం ఉన్నట్లయితే వారు కూడా అనర్హులు. ఆ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ కడుతున్నట్లయితే వారు కూడా అనర్హులు, మాగాని పొలం మూడు ఎకరాలకు మెట్ట పొలం పది ఎకరాలకు రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉన్న వారు కూడా అనర్హులు. ఇలా వివిధ కారణాలతో గత ప్రభుత్వంలో చాలామంది రేషన్ కార్డులకు అర్హత కోల్పోయారు. మరికొందరివి నిబంధనలకు అనుగుణంగా లేనివి తొలగించబడ్డాయి. అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి విషయాలు అన్నిటినీ పరిశీలించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకొని అర్హులైన వారికి కేవలం రెండున్నర గంటలో కూడా అందించిన సందర్భాల్లో ఉన్నాయి అయితే రాను రాను ముందు రోజుల్లో ఈ ప్రక్రియ అనేది చాలా నిదానంగా కొనసాగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 1,47,33,044 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రేషన్ కార్డుల సంఖ్య 1,48,43,671 కి చేరింది అంటే గత ప్రభుత్వ కాలంలో కేవలం 1,10,000 కార్డులు మాత్రమే పెరిగాయి. కొత్తగా పెళ్లయిన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు గత ప్రభుత్వం విధించిన నిబంధనలు ఆధారంగా కొత్త కార్డులను కోల్పోయేవారు. వీటన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించి కొత్తగా పెళ్లయిన వారికి వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయనున్నారు.
Free bus travel for health pensioners – ap – Click Here
Youth Skill Count in AP | ఏపీ లో యువత నైపుణ్య గణన సమాచారం – Click Here