ఏపీ టెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రోజుకి రెండు సెక్షన్లు అనగా ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రంలోనికి గంటన్నర ముందే అనుమతిస్తారు. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పరీ
క్షా కేంద్రంలోని అధికారులకు ఆధారాలు చూపించి సరిచేసుకునేందుకు సదుపాయం కలదు.
AP TET 2024 Hall tIckets – Click Here
NTR Bharosa Pension Update 2024 – Click Here
AP TET 2024 IMPORTANT INSTRUCTIONS TO THE CANDIDATE
- పరీక్షా హాలుకు వెళ్లే ముందు హాల్ టికెట్లో మీ పేరు, డేట్ అఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నంబర్ సరిచూసుకోవలెను.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా సమయానికంటే ముందే 1:30 నుంచి పరీక్ష హాల్లోనికి అనుమతి ఉంటుంది.
- పరీక్ష హాలుకు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి (ఉదాహరణకు: ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్ వీటిలో ఏదో ఒకటి కచ్చితంగా తీసుకువెళ్లాలి)
- ఎవరి హాల్ టికెట్లో ఆయన ఫోటో సరిగా రాకపోయినా లేదా, ఫోటో ప్రింట్ కాకపోయినా అలాంటివారు వారి యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను పరీక్షా కేంద్రానికి తీసుకు వెళ్ళవలెను.
- పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రాకూడదు. ఎవరైనా పరీక్ష మధ్యలో బయటకు వచ్చినట్లయితే అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది.
- పరీక్ష సమయంలో ఏదైనా టెక్నికల్ సమస్య ఉన్నట్లయితే ఇన్విజిలేటర్ కు తెలియజేయవలెను.
- పరీక్షా సమయం 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాలు మాత్రమే ఉండును.
- తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్క్స్ లేవు.
- కొచ్చిన్ పేపర్ ఇంగ్లీష్ మరియు మీరు ఎంచుకున్న భాష అనగా తెలుగు లేదా ఉర్దూ లేదా తమిళ్ మొదలగు భాషలలో ఉండును.
- ఒక స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ రెండు భాషలలో ఉండడం జరుగుతుంది. మనం ఎంచుకున్న భాషలో మరియూ ఇంగ్లీషులో ఉండును.
- పరీక్ష రాసే అభ్యర్థులు మీ విలువైన వస్తువులను పరీక్షా కేంద్రం బయట పోగొట్టుకున్నట్లయితే పరీక్షా కేంద్రం మేనేజ్మెంట్ కు ఎటువంటి సంబంధం ఉండదు.
- పరీక్ష రాసే అభ్యర్థులు వారి ఆధారాలను పరీక్ష కేంద్రం అధికారులు పరిశీలించి, నిషేధిత వస్తువులను తీసుకుపోవడం లేదని గుర్తించిన తర్వాత లోపలికి పంపుతారు.(పరీక్ష హాలు లోనికి వెళ్లే ముందు చెకింగ్ ప్రక్రియ ఉంటుంది)
- అత్యవసర సమయంలో మాత్రమే టాయిలెట్ కు వెళ్ళవలెను.
పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లకూడని వస్తువులు
పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని ఈ క్రింది తెలిపిన వస్తువులు లోనికి తీసుకు వెళ్ళకూడదు. అలా తీసుకువెళ్లనట్లయితే ఆ అభ్యర్థిని డిస్క్ క్వాలిఫై చేయడం జరుగుతుంది.
- స్టడీ మెటీరియల్
- మొబైల్ ఫోన్
- ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్
- ట్యాబ్
- పెన్ డ్రైవ్
- ఐపాడ్
- బ్లూటూత్
- పేజర్స్
- రైటింగ్ పాడ్స్
- వాలెట్స్
- రిస్ట్ వాచీలు
- హ్యాండ్ బ్యాగ్ లో
- ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు