Ayushman Bharat for senior citizens above 70 years, eligibility and registration

Ayushman Bharat for senior citizens above 70 years: కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించనుంది. ఈ ఉచిత బీమా పథకం ద్వారా 70 సంవత్సరాలు పైబడిన వారికి 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం బీమా కల్పించనుంది.

దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన వారికి ఐదు లక్షల రూపాయలు బీమావర్తించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తేదీ 29-10-2024 న ప్రారంభించడం జరిగింది. దేశంలోని 70 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఈ బీమా పథకం వర్తించనుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కార్డులు కలిగిన వారు ఈ బీమా సౌకర్యాన్ని పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ కార్డు లేని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది.

Aayushman Bharat PMJAY 70+ eligibility criteria

ఆయుష్మాన్ భారత్ PMJAY ద్వారా వృద్ధులకు 5 లక్షల రూపాయల ఉచిత భీమా పొందడానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  • ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండవలెను.
  • 5 లక్షల రూపాయలు అదనపు బీమా పొందడానికి వయసు 70 సంవత్సరాలు పూర్తయి ఉండవలెను.
  • దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించును.

Application Procedure for Above 70 years under Ayushman Bharat PMJAY

70 సంవత్సరాలు పైబడిన వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఐదు లక్షల బీమా పొందడానికి ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Step 1: 70 సంవత్సరాలు పైబడిన వారికి రిజిస్ట్రేషన్ చేయుటకు ముందుగా ఎక్కింది ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయవలెను.

 PMJAY Official Website

Step 2: పై లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ enroll for PMJAY 70+ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను.

Ayushman Bharat for senior citizens above 70 years

Step 3: పైన గుర్తించిన ఆప్షన్ మీద క్లిక్ చేసినా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ దగ్గర ఇచ్చిన క్యాప్ ఛానెల్ నమోదు చేయవలెను, మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి వెరిఫై బటర్ మీద క్లిక్ చేయగా మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది.

Step 4: లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ click her to enroll అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

Step 5: పైన తెలిపిన విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది. ఆధార్ నంబర్ దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఫ్యామిలీ ఐడీ తెలిసినట్లయితే ఫ్యామిలీ ఐడి నమోదు చేయవలెను, తెలియకపోయినట్లయితే ఖాళీగా ఉంచవలెను. క్యాప్చర్ దగ్గర ఇచ్చిన క్యాప్షన్ నమోదు చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయవలెను.

 

 

Step 6: సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యుల వివరాలు కనిపించడం జరుగుతుంది. అక్కడే ఈ పథకానికి అర్హులు అయ్యారా లేదా చూపించడం జరుగుతుంది. ఎన్రోల్ కాకపోయినట్లయితే మీ పేరు మీద క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చును.

Step 7: పైన చూపిన విధంగా వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగా ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి ఓటిపి వెళుతుంది దానిని ఎంటర్ చేసి ఎన్ని రోజులు చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకున్న కొంత సమయం తర్వాత కార్డ్ జనరేట్ అవుతుంది. ఆయుష్మాన్ కార్డ్ జనరేట్ అయ్యాక మీరు డౌన్లోడ్ చేసుకొని ఐదు లక్షల బీమా సదుపాయాన్ని పొందవచ్చు.

FAQs Related to the Ayushman Bharat for senior citizens above 70 years

ఈ పథకం ద్వారా ఎంత బీమా లభించనుంది ?

ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా లభించనుంది.

ఈ పథకానికి అర్హత కొరకు వయసు ఎంత ఉండవలెను?

ఈ పథకం అర్హత పొందడానికి వయసు 70 సంవత్సరాలు పూర్తి అయి ఉండవలెను.

ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అయినది?

తేదీ 29-10-2024 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది.

మీ పథకం అర్హతకు ఆధార్ కార్డు కావాలా?

అవును ఈ పదం అర్హత కొరకు లబ్ధిదారులు భారత పౌరుడై ఉండి ఆధార్ కార్డు కలిగి మరియు వయసు 70 సంవత్సరాలు దాటి ఉండవలెను.

ఒకే కుటుంబంలో ఇద్దరు 70 సంవత్సరాలు పూర్తయిన వారు ఉన్నట్లయితే వారిద్దరూ ఈ పథకానికి అర్హులవుతారా?

అవును అర్హులు అవుతారు.

ఆయుష్మాన్ భారత్ కార్డులు లేని వారు కార్డులో కొరకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

కార్డులు లేని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మొబైల్ లో లేదా మీకు దగ్గరలోని మీసేవ సెంటర్ లేదా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు.

ఈ పథకానికి మరే ఇతర అర్హతల ఆధారంగా ఈ పథకానికి అర్హతలు గుర్తించడం జరిగిందా ?

లేదు ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ల అందరికీ ఈ పథకం వర్తించెను.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందించే ఆసుపత్రుల సంఖ్య?

ఇప్పటివరకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందించేందుకు 29,648 ఆస్పత్రులను గుర్తించారు. ఇందులో 12,696 ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నాయి.

ఈ పథకం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉందా?

ఈ పథకం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ మినహా 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి రానుంది.

 

 

Leave a Comment