Good News for Livestock and Aqua Farmers from the Center:
తాజాగా మన దేశంలో రైతులకు నమ్మకం కల్పించేలా మన ప్రధానమంత్రి (PMFBY)ఫసల్ బీమా యోజన పథకంలో ఎన్నో మార్పులను చేయడం జరిగింది. ఈ పథకం ముఖ్యంగా పంటలను బీమా చేయించుకున్న వారికి ప్రకృతి వైపరీత్యాల వల్ల వానలు వరదలు, తుఫానులు అకాల వర్షాల వంటివి రావడంతో పంట నష్టం కలిగినప్పుడు ఇన్సూరెన్స్ ను ప్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వంట ఇంత మొత్తంలో నష్టం వాటిల్లిందో తెలుసుకొని దానికి తగ్గ అమౌంట్‌ను రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కోతలు ఆయన తరువాత కూడా ఇన్సూరెన్స్ కొనసాగించడంతోపాటు పాడి ఆక్వా రంగాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రపంచంలోనే అతి పెద్ద పంటల బీమా పథకం (PMFBY)
రైతన్నకు ఉపయోగపడే ఈ బీమా పథకం ప్రపంచంలోని అతిపెద్ద పంటల బీమా పథకం గా గుర్తింపు పొందడం జరిగింది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది రైతులు నమోదు చేసుకుంటున్నా ఈ అతిపెద్ద బీమా పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని పథకాలలో అన్ని ప్రీమియంతో పాటు ప్రపంచంలోనే ఇది మూడో అతి పెద్ద పథకంగా మనం చెప్పుకోవచ్చు.
ఈ పథకం ద్వారా మొదటిగా వచ్చే దాన్యాల వివరాలు :-
- పప్పు ధాన్యాలు
- తృణధాన్యాలు
- నూనె గింజలు
ఈ పథకం ఆశిక వాణిజ్య పంటకు మాత్రమే ఉపయోగపడేలా చేశారు. తరువాత కొన్ని ఉద్యాన పంటలకు అనగా పండ్లు కూరగాయలు కూడా ఇందులో జత చేయడం జరిగింది. పథకం ఓన్లీ భారీ వరద నష్టానికి కాకుండా వడగండ్ల వానకి ఉష్ణోగ్రతకు మంచుకు, తేమకు మంచు కు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే వాతావరణ పరిస్థితులకు కలిగే నష్టాలకు రక్షణగా ఉంటుంది. రైతన్నలు పంట దున్నిన సమయము నుండి నా రాతలు వేసిన సమయంలో మధ్య మధ్యలో రియల్ టైం ఫోటోలను సమాచార సేకరణ కోసం స్వీకరించడం జరుగుతుంది. బీమా చేసిన ప్రతి రైతుకు ఒక కార్డు అనగా గుర్తింపు కార్డు ఇచ్చి వారి భూమికి జియో టాకింగ్ చేస్తారు. రైతుల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో PMFBY ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. రైతన్నల పంట పొలాల అంచనాల కోసంగా 70% పంట కోత ప్రయోగాలను దిగుబడి అంచనాల కోసం స్వీకరించడం జరుగుతుంది. అలాగే మిగిలిన 30 శాతానికి సాంకేతికంగా ఉపయోగించడం జరుగుతుంది.

గతంలో బ్యాంకుల నుంచి ఎవరైతే పంటం రుణం తీసుకున్నారు వారికి మాత్రమే ఈ పథకం వర్తించేది. రుణాలు తీసుకున్న రైతులు కూడా నిర్దిష్ట బీమా చెల్లిస్తే వారి పంటలకు ఈ పథకం అమలయ్యే విధముగా ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే రైతులు పంట కోత తర్వాత రైతులు వాటిని గూడంలో కానీ లేదా ఇంటి వద్ద కానీ నిల్వ చేసేవారు. కొన్ని సమయాలలో వర్షాలు అధిక మోతాదులో భారీ నుంచి అతి భారీ వర్షాల వలన వరదలు సంభవించినప్పుడు అంటే మొత్తం నీరు పాలై తడిసిపోయి రైతులు ఎంతగానో నష్టపోయేవారు. మరి కొన్ని సందర్భాల్లో మార్కెట్ వరకు తీసుకుని వెళ్లిన వరదకు గురై జరుగుతుంది కొట్టుకొని కూడా పోతుంది. దీని ద్వారా రైతన్నకు ఎంతగానో నష్టం వస్తుంది. ఇలాంటి సమస్యలను మన కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి వచ్చే విజ్ఞప్తులను అన్నిటిని అనుసరించి కోతల అనంతరం రైతు మొత్తం పంటను అమ్ముకునే వరకు ఈ బీమా పథకం వర్తింపజేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆక్వా పాడి పరిశ్రమకు కూడా ఉపయోగపడే పథకం

వానలు వరదలు అతి నుంచి అతి భారీ వర్షాల వలన కొన్ని కొన్ని దగ్గరలా పిడుగు పట్ల వలన పంటతో పాటు పశు సంపద కూడా రైతులు కోల్పోతున్నారు. మనం చూసినట్లయితే ఎన్నో వరదల కారణంగా అనేక సందర్భాలలో వేలాది పాడి పరిశ్రమ వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం మనందరికీ తెలిసిన విషయమే. నా పాడి పరిశ్రమ ఆర్థికంగా ఎంతగానో నష్టపోతుంది. అటు ఉండగా ఇటు ఆక్వారంగాన్ని కూడా నష్టం జరగడం పాడి రైతులు పెంపకం దారులు చేపలు, రొయ్యలు పెంపకం దారుల నుంచి వచ్చిన వ్యవసాయ ఏటగిరి కింద పాడి ఆక్వారంగాలు కూడా ఈ పథకం అమలు చేయాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఎలా ఫసల బీమాను చెల్లించడం
మన ప్రధానమంత్రి ఫసల బీమా కింద ఏదైతే పంటను ఎంపిక చేసి ఉంటారో ఆ పంటకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే బ్యాంకు సిబ్బంది రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసే సంబంధిత భీమా కంపెనీకి నేరుగా చెల్లించడం జరుగుతుంది.రైతులు పంటల కోసం బ్యాంకులో రుణం తీసుకునే వారు కూడా పంట బీమాను చెల్లించవచ్చు. రైతు సేవ కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంట బీమా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని ఏర్పాటు చేశారు.
పంట బీమా కోసం కావలసిన డాకుమెంట్స్
ఈ పంట బీమా కోసం రైతులు వారికి సంబంధించిన
- ఆధార్ కార్డు
- భూమి పత్రాలు
- రేషన్ కార్డు
- పట్టాదారుని పాసు పుస్తకం
- పంట బీమా ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు వివరాలు మరియు పత్రాలు
- ఆధార్ కార్డుకు లింక్ అయినా ఫోన్ నెంబరు. కౌలుకు తీసుకున్న రైతులయితే వారికి ఇచ్చిన పత్రాలతో పాటు ప్రభుత్వ అందజేసిన కౌలు కార్డును తీసుకొని పంటకు బీమా చేయించుకోవచ్చును.