NTR Bharosa Pension Update 2024 : October
గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రిత్యా ఈ నెల పెన్షన్ తీసుకొని 2658 పెన్షన్ దారులకు అక్టోబర్ నెల రెండు నెలల ( సెప్టెంబర్ + అక్టోబర్ ) పెన్షన్ ఇవ్వటం జరుగును. సచివాలయాల వారీగా పెన్షన్ ల అమౌంట్, ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ ఇవ్వటం జరిగింది. 👇👇👇
పెన్షన్ పంపిణీ లో మార్గదర్శకాలు సవరణ
- పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది.
- నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించనుంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
- పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
- 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది.
- రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది.
కొత్తపెన్షన్లు పై కసరత్తు
- కొత్త పెన్షన్లను అక్టోబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
- గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది.
- గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు.
- సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు.
- క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటించే ఛాన్సుంది.
NTR భరోసా పెన్షన్ స్టాటస్
గత ప్రభుత్వ కాలంలో పెన్షన్ కు అప్లై చేసి పెన్షన్ సాంక్షన్ కాని వారు వారి యొక్క పెన్షన్ అప్లికేషన్ అప్రూవయిందా? లేదా రిజెక్ట్ అయిందా? లేదా ఎవరిది లాగిన్ దగ్గరైనా పెండింగ్లో ఉందా? అనే అంశాలు మన మొబైల్ లోనే చూసుకోవచ్చు పెన్షన్ స్టేటస్ చూడడానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
AP Ration Card 2024 – కొత్తగా పెళ్లి అయిన వారికి రేషన్ రేషన్ కార్డ్ – Click Here
Free bus travel for health pensioners – ap – Click Here
Youth Skill Count in AP | ఏపీ లో యువత నైపుణ్య గణన సమాచారం – Click Here