పోలవరం ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌

పోలవరం ప్రాజెక్ట్.

పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి దశ పూర్తి:-

మన కూటమి ప్రభుత్వం రావడం తో పనులు చక చక అంటూ అతి వేగంగా దుసుకొని పోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని సవ్యముగా జరుగుతున్నాయి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేస్తాను. ప్రజలకు ఎలాంటి భయం లేదు పునరావాసాలు గ్యారెంటీ అంటున్నా చంద్రబాబు నాయుడు గారు.

పోలవరం ప్రాజెక్ట్‌ మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టిగ స్పష్టం చేశారు.

పెండింగ్ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్‌ చేసి 2027 డిసెంబర్‌ కల్లా ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకొని వస్తాము అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

మార్చి 27 పోలవం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా అబ్సర్వ్ చేయడం జరిగింది. అనంతరం ప్రాజెక్టు హెలిప్యాడ్ సైట్ వద్ద పోలవరం బాధితులతో మాట్లాడారు.

గత ప్రభుత్వం వలన పోలవరం ఆలస్యానికి కారణమని. రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే గత ప్రభుత్వం వల్ల కొట్టుకుపోయింద‌న్నారు.

 

ఇప్పుడు మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మించాము అని చంద్రబాబు తెలిపారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులతో మాట్లాడి . రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని, 2026 నాటికి నిర్వాసితులకు పునరావాసాలు పూర్తి చేస్తాము అని చంద్రబాబు చెప్పడం జరిగింది.

ప్రాజెక్టుకి భూములిచ్చిన రైతులకు చాలా తక్కువ మొత్తం ఇచ్చారని, సీఎం వాపోయారు.

2014లో తాము అధికారంలోకి రాక ముందు భాధితులకు చాలా తక్కువ అమౌంట్ ఇచ్చార‌ని చంద్రబాబు ఆగ్రహం చూపారు.

2014లో ప్రభుత్వం వచ్చాక రూ.4,311 కోట్ల పరిహారం చెల్లించిన విష‌యాన్ని సీఎం తెలియ జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతు కానీ ఆప్పటి ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా బాదితుల గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని చెప్పడం జరిగింది.

పునరావాసం కల్పించిన తర్వాత బాదితుల‌ ఆదాయ గురించి , జీవన విధానం పెరగడానికి చర్యలు తీసుకుంటామ‌ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామి ఇవ్వడం జరిగింది.

పోలవరం ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి

Leave a Comment