ప్రస్తుత సమాజంలో సగటు మనిషి తన ఉద్యోగరీత్యా బ్రతుకు తెరువు రీత్యా మనిషి ఆరోగ్యం పై దృష్టి సారించలేకపోతున్నారు . దీని ప్రభావం మన మీదే కాకుండా మన కుటుంబం మీద కూడా ప్రభావం చూపుతుందని గ్రహించలేకపోతున్నాను. ఉదాహరణకి మన ప్రయాణాలలో ఏదైనా ప్రమాదాలు జరిగిన లేదా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి చనిపోయిన వారి కుటుంబం కష్టాలు పడుతుంది. ఒక కుటుంబ పెద్ద హఠాత్తుగా మరణించిన లేదా ప్రమాదానికి గురైన వారి కుటుంబానికి నష్టపరిహారం రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక ఇన్సూరెన్స్ ద్వారా వారి కష్టాలను కొంతమేర పూడ్చవచ్చు.

దానికి మనం చేయవలసింది
మన జీవితంలో కనీసం ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ అయినా కట్టి ఉంటే అనుకోకుండా మనకు ప్రమాదం జరిగిన కుటుంబ పెద్ద మరణించిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వారి కుటుంబం లబ్ది పొందవచ్చు. దీనికి నిదర్శనం ఈరోజు జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణ. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజుర మండలం మొండి గేట్ గ్రామానికి చెందిన బానోత్ కిషన్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరిలో TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏడాదికి 50వేల రూపాయలు ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకోవడం జరిగింది. అయితే అతను ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించడం జరిగింది.

విషయం తెలుసుకున్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కాగజ్నగర్ ఏజెంట్ గుగులోత్ రజిత గారు అతను తీసుకున్నది ఒకే ఒక్క ప్రీమియం చెల్లించినా కూడా నామిని అయినా మృతుడి భార్య భానోత్ జ్యోతి కు క్లైమ్ అందించే ఏర్పాటు చేశారు.

సోమవారం నాడు మృతుడి భార్య అయినా జ్యోతిని దిల్సుఖ్నగర్ బ్రాంచ్ ఆఫీసుకు తీసుకువచ్చి బ్రాంచ్ ఇన్సూరెన్స్ అధికారులు మరియు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా జ్యోతి కి ఆరు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఏజెంట్లను అభినందించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అండగా నిలవడానికి ముందుంటుందన్నారు. ప్రతి వ్యక్తి టర్మ్ పాలసీని తీసుకుని తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. భానోత్ కిషన్ ముందు చూపుతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇవాళ అతని కుటుంబం కొంత ఆర్థికపరంగా నిలబడగలిగిందన్నారు.
అనంతరం సీనియర్ బిజినెస్ అసోసియేట్ అయిన కంది కంటి విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిబద్ధతను మరియు క్లైమ్ సెటిల్మెంట్లో వేగవంతమైన సేవలను ప్రదర్శించిందన్నారు. ఇన్సూరెన్స్ చేసుకుని కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అందించే లక్ష్యాన్ని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బలపరుస్తుందన్నారు. వినియోగదారులకు సేవలు అందించడంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, మేనేజర్ నున్న మురళి, చీఫ్ బిజినెస్ అసోసియేట్ శ్రీధర్ మాల్యల, బిజినెస్ అసోసియేషన్ లీడర్లు ఎర్ర మంజుల మహేష్, కొంగరి అరుణ మరియు ఏజెంట్ గుగులోత్ రజిత తదితరులు పాల్గొన్నారు.