ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం.

 ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం.

కస్తూర్బా గాంధీ విద్యాలయాంలో రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను చదివించుకోవడం కోసం మన గవర్నమెంట్ కొత్త పథకాన్ని తీసుకోవడం జరిగింది.

ఎంతోమంది పేద విద్యార్థుల కోసం గా ఉచిత విద్యను అంద చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. . ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాలనేది కేజీబీవీ ముఖ్య ఉద్దేశం.

ఉచిత విద్యతోపాటు HOSTEL వసతి కూడా వీరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే  పుస్తకాలు యూనిఫాంలో నాణ్యమైన భోజనము ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మెడికల్ చెకప్ లు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రతి ఒక్క బాలికలకు విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశంగా కేజీబీవీ నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఒక్క జిల్లాలో కేజీబీవీ పాఠశాలలు చాలానే ఉన్నాయి. ఉచిత విద్యతోపాటు వృత్తి పరమైన కోర్సులు కూడా అందించడం జరుగుతుంది.

ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. నేటి సమాజంలో చదువు అనేది చాలా కీలకమైన విషయం. డబ్బు లేక చాలామంది వెనుకబడిన కుటుంబాలు పిల్లల్ని చదివించకుండా పనులకు పంపించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఈ కేజీబీవీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలని వారి యొక్క కలలను నెరవేర్చాలని కేజీబీవీ ఈ నిర్ణయం తీసుకుంది.

వెనుకబడిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ధైర్యంగా మీ పిల్లలను కేజీబీవీ లో చేర్పించండి. కలలను నెరవేర్చుకునే అవకాశాన్ని కల్పిద్దాం.

బాలికలు గ్రామీణ ప్రాంతాలకు వెనుకబడిన వారై ఉండాలి.
నిర్దిష్ట కులాలకు అల్ప సంఖ్యాక వర్గాలకు మొదటిగా వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బాలికలకు ఉచిత విద్య ఉచిత వసతి మానసిక అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు మహిళల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకారం.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉచిత విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అనాధలకు,

బడి బయట ఆడుకునే పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బి పి సి అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉన్నత విద్యార్హతలు అనుభవము కలిగిన ఉపాధ్యాయులచే విద్యను అందించడం.

6 నుండి 12 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించడం.

యోగా తరగతులతో పాటు ఆరోగ్య వ్యాయామ విద్యా మరియు క్రీడలు కేజీబీవీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

దరఖాస్తు ప్రక్రియ:-

19-3-24 to 11-04-2025 వరకు
వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవలెను.

మీసేవ కేంద్రాల మరియు సచివాలయం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనుటకు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళవలెను.

అవకాశం ఉన్నవారు ఆదాయ ధ్రువీకరణ పత్రము మరియు కుల దృవీకరణ పత్రమును జత పరచవలెను.

Leave a Comment