Table of Contents
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “నైపుణ్య గణన”పై సిఎం చంద్రబాబు గారు సంతకం చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చదువుకున్న వారే లక్ష్యంగా కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరినీ నైపుణ్యాలను గణించే దిశగా నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్-Youth Skill Count in AP) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
గతంలో కేవలం యువత, చదువుకున్న వారికి మాత్రమే ఈ నైపుణ్యజ్ఞానం చేపట్టేవారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వినూత్నంగా కేవలం యువత చదువుకున్న వారు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో లోపు ఉన్నవారికి ఈ నైపుణ్యాన్ని లెక్కించనున్నారు.
నైపుణ్య అభివృద్ధి సంస్థ నైపుణ్య గణనకు ప్రత్యేక యాప్ ను రూపొందించి సచివాలయ సిబ్బంది ద్వారా రెండు నెలలో ఈ సర్వే ను పూర్తి చేయనున్నారు.
కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతే కాకుండా వ్యవసాయం, వడ్రంగి, కుమ్మరి, గృహినిలు, వివిధ రకాల వృత్తికారులు ఇలా ప్రతి ఒక్కరిని ఈ గణాల్లోకి తీసుకున్నారు.
ఉదాహరణ 1: ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నట్లయితే …. వారికి అధునాతన వ్యవసాయ పద్ధతులు ఏ మేరకు తెలుసు? అధునాతన వ్యవసాయ పరికరాలు ఏమాత్రం తెలుసు? వాటిని మెరుగుపరిచే ఆసక్తి ఉందా? కొత్త పద్ధతులను అవలంబించేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? ఇలా వివిధ అంశాలకు సంబంధించి సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది.
ఉదాహరణ 2: గృహిణి అయినట్లయితే?…
వారు ఎంతవరకు చదువుకున్నారు? వారు గతంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాశారు? వారికి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి? ఏ అంశాల పైన నైపుణ్యం కలిగి ఉన్నారు? మొదలైన అంశాలు సర్వే చేపట్టనున్నారు.
ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి నైపుణ్యాన్ని అంచనా వేయడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రణాళికలను సృష్టించడం సులభతరం అవుతుంది. ఇలాగే ప్రతి వ్యక్తులను నైపుణ్య స్థాయిని కూడా అంచనా వేయనున్నారు, ఒక వృత్తిలో అందరూ ఒకే దాన్ని కలిగి ఉండరు వారి స్థాయిలను కూడా వివిధ కేటగిరీలుగా విభజించనున్నారు. భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఉద్యోగా, ఉపాధి అవకాశాలకు పోటీ పడగలరు అనేది అంచనా వేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
Youth Skill Count in AP
నైపుణ్య గణన అనంతరం ప్రభుత్వం మరో రెండు కార్యక్రమాలు చేపట్టనుంది ఒకటి ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం, రెండోది పరిశ్రమల అవసరాలను ఈ నైపుణ్యాలతో అనుసంధానం చేసి అంటే రాష్ట్రంలోని ప్రజల్లో పలు రకాల నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటి గురించి పరిశ్రమలకు తెలియడం లేదు. రాష్ట్రంలో పలు నైపుణ్యాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారని లెక్కలను అందుబాటులో ఉంచితే సంబంధిత పరిశ్రమలు వారి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ సర్వే ను రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా వారి నైపుణ్యాలను అంచనా వేస్తారు, దీని కొరకు రూపొందించిన యాప్ లో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి వారి యొక్క వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న వారి వివరాలను గ్రామం వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నైపుణ్యాలను నమోదు చేస్తారు. సచివాలయ సిబ్బంది ద్వారా రోజుల్లో 20 మందికి మాత్రమే సర్వే చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
మరింత సమాచారం కొరకు – Contact US
ప్రబుత్వ పథకాల కొరకు – ఇక్కడ క్లిక్ చేయండి