మత్స్యకారులకు బంపర్ గిఫ్ట్
మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకు ఒక గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చారు.
ఒక్కొక్క కుటుంబానికి 20000 వారి ఖాతాలో జమ
మే నెలలో మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార కుటుంబాలకు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్క కుటుంబానికి 20000 వారి ఖాతాలో జమ చేయనున్నారు. ఎన్నో వేల కుటుంబాలకు ఇది ఒక ఆర్థిక సాయం గా ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
మత్స్యకారులు చేపల వేటకు పోలేని సమయంలో వారికోసం ఆర్థికంగా ఎంతో కొంత మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులు గుర్తుంచుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని అందరితో చర్చించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
గతంలో 10000 సాయాన్ని అందజేస్తుండగా ఇప్పుడు ఆ 10000 గాను మరొక 10000 చేర్చి 20000 మత్స్యకారుల కుటుంబానికి నేరుగా వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
మత్స్యకారుల దగ్గరకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్లి చేయడం గమనార్హం.
మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మత్స్యకారుల కుటుంబానికి ఎంతో ఆర్థిక సాయంగా ఉండబోతుంది.
మత్స్యకారులు వేట నిషేధం వల్ల ఎంతో బాధతో ఉన్నప్పటికీ ప్రభుత్వం మేము ఉన్నాము అని చెప్పి 20వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారుల పట్ల ఉన్న ప్రేమ అభిమానం ఈ రూపంలో మనం తెలుసుకోవచ్చు. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలలో చైతన్యం నింపుతుంది.
మే నెల 26 వ తేది నా మత్స్యకారుల అకౌంట్లోకి 20000 జమ
మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. ఈ 20,000 వాళ్ళకి ఎంతగానో ఆర్థికంగా ఉపయోగ పడుతుందని మత్స్యకారులు వారి సంతోషన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ 10000 కూడా రాక ఎన్నో ఇబ్బందులు పడ్డామని మత్స్యకారులు వారి యొక్క బాధను చెప్పడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలను చూసాము ఇలా మా కోసంగా ఆలోచించి 20వేల రూపాయలు మా అకౌంట్లో వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంతగానో రుణపడి ఉంటాము మత్స్యకారులు వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు.