AP Free Gas Cylinder Scheme 2024: How to book, Apply Online, Check Eligibility and Benefits

AP Free Gas Cylinder Scheme 2024: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల లో భాగంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకానికి బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏడాదికి ఉచితంగా ఇచ్చే మూడు వంట సిలిండర్లకు గాను మొదటి సిలిండర్ను మంగళవారం నుంచి ఆయా గ్యాస్ కంపెనీలలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల జిల్లా అధికారులు ప్రకటించారు.

ముందుగా సిలిండర్ కోసం నమోదు చేసుకున్న తర్వాత ఇంటికి సిలిండర్ను ఆయా గ్యాస్ కంపెనీలు సరఫరా చేస్తాయి సరఫరా చేసిన సిలిండర్ ధరను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ డెలివరీ అయిన తర్వాత అర్హత గల లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల వారికి 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల వారికైనట్లయితే 48 గంటల్లోగా సిలిండర్ కు చెల్లించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.

When can I book the free cylinder??

దీపం-2 పథకం ద్వారా అర్హత గల లబ్ధిదారులు ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అనగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక ఉచిత సిలిండర్ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

First cylinder booking time

అర్హత గల లబ్ధిదారులు మొదటి సిలిండర్ను అక్టోబర్ 31 నుంచి 2025 మార్చి 31 లోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు.

Second cylinder booking time

రెండవ ఉచిత సిలిండర్ ను అర్హతల లబ్ధిదారులు ఏప్రిల్ 1 నుంచి జూలై 30 మధ్య 2వ ఉచిత సిలిండర్ లో బుక్ చేసుకోవాలి.

Third cylinder booking time

మూడో ఉచిత సిలిండర్ను అర్హతకు లబ్ధిదారులు ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ బుక్ చేసుకోవచ్చును.

Eligibility requirements

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకాన్ని అర్హులు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా అనుసంధానం చేసి ఉండాలి. లబ్ధిదారుల ఆధార్ కార్డు ఇతర రాష్ట్రాలకు చెందిన చిరునామాతో ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు.

ఆధార్, రేషన్, బ్యాంక్ ఖాతాలో లింక్ అవ్వవలెను లింక్ లేని ఎడల గ్యాస్ ఏజెన్సీలు వద్ద లింక్ చేయించుకోవలెను.

Booking process

ఉచిత సిలిండర్ లను బుక్ చేసుకొనుటకు గతంలో లాగా మేమే గ్యాస్ ఏజెన్సీల బుకింగ్ నెంబర్ల కు కాల్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చును (పాత పద్ధతులతో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు). గ్యాస్ డెలివరీ సమయంలో నగదు చెల్లించి డెలివరీ చేసుకోవలెను. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత ఉండి పట్టణ ప్రాంతాల వారికి అయినట్లయితే 24 గంటల్లోగా మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి అయితే 48 గంటలలోగా చెల్లించిన నగదు మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది.

AP Free Gas Cylinder Scheme 2024 Budget

దీపం- 2 పథకం ద్వారా ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి తొలి ఏడాదికి గాను 2,684 కోట్ల రూపాయలు మంజురుచేసింది. ఇందులో తొలివిడతగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

AP Free Gas Cylinder Scheme 2024 FAQs

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది?

ఉచిత గ్యాస్ సిలిండర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఈ పథకానికి ఎవరు అర్హులు?

ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై గ్యాస్ కనెక్షన్ కలిగి వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుటకు గ్యాస్ కనెక్షన్ కి ఆధార్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది తప్పనిసరి.

ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు?

ఈ పథకానికి సంబంధించి అర్హత గల లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు సిలిండర్ లను ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుంది.

ఉచిత సిలిండర్ కావాలనుకున్న వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి?

AP Free Gas Cylinder Scheme 2024

గతంలో మీరు గ్యాస్ సిలిండర్ను ఏ విధంగా బుక్ చేసుకునే వారో అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ సమయంలో లబ్ధిదారులే నగదు చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లించాక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అర్హత గల లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో నగదు జమ అవుతుంది.

ఈ సబ్సిడీ ఎప్పటిలోగా జమవుతుంది?

అర్హత గల లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల వారికి గ్యాస్ డెలివరీ అయిన 24 గంటల్లోగా గ్రామీణ ప్రాంతాల వారికి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అగును.

లబ్ధిదారులకు ఏ ఖాతాలో నమోదు జమను?

అర్హతగా లబ్ధిదారులకు ఆధార్ కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే నగదు జమవుతుంది.

మొదటి ఉచిత సిలిండర్ ని ఎప్పుడు బుక్ చేసుకోవాలి?

అక్టోబర్ 31 నుంచి 2025 మార్చ్ 31 మధ్య.

రెండవ ఉచిత సిలిండర్ ను ఎప్పుడు బుక్ చేసుకోవాలి?

ఏప్రిల్ 1 నుంచి జులై 30 మధ్య

మూడో ఉచిత సిలిండర్ ను ఎప్పుడు బుక్ చేసుకోవాలి?

ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 మధ్య

ఉచిత సిలిండర్ల పథకానికి ప్రతి ఆట అయ్యే ఖర్చు?

ఈ పథకం అమలకు ప్రత్యేక దాదాపు 2684 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా

 

Leave a Comment