Andhra Pradesh Free Gas Cylinder Scheme 2024: Check eligibility, benefits

Andhra Pradesh Free Gas Cylinder Scheme 2024: Check eligibility, benefits

NDA ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో ప్రధాన పథకం ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీలను ఒక్కొక్కటిగా ప్రారంభించే దిశగా ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. Andhra Pradesh Free Gas Cylinder Scheme 2024 ప్రారంభించుటకు  ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపజేసినట్లయితే ఏడాదికి రూ.3640 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వనుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1,763 కోట్లు అవ్వనుంది. ఈ పథకానికి సంబంధించి ఏడాదికి ఎంత ఖర్చవుతుంది? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు? మొదలగు అంశాలకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.

Andhra Pradesh Free Gas Cylinder Scheme 2024 Befifits

ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర సుమారు 825.50 రూపాయలు వుంది. ఏడాదికి మూడు సిలిండర్ లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం కో కుటుంబానికి 2,476.50 రూపాయలు ప్రయోజనం కలగనుంది.

రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే 1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ఉంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద 95% కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Application Process

ఈ పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తన సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మన వెబ్సైట్ నందు అప్డేట్ ఇవ్వడం జరుగును.

Andhra Pradesh Free Gas Cylinder Scheme 2024

Required Documents

ఈ పథకానికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ ఈ క్రింది విధంగా ఉండనున్నాయి..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకనూ విడుదల చేయలేదు.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్స్
  • ఆధార్ కార్డు కు లింక్ అయిన మొబైల్ నంబర్
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
    గమనిక: కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రభుత్వం ఇంకా అధికారకంగా విడుదల చేయలేదు.

AP TET 2024 IMPORTANT INSTRUCTIONS TO THE CANDIDATE – Click Here

NTR Bharosa Pension Update 2024 – Click Here

AP KGBV Recruitment 2024 : కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం – Click Here

 

Leave a Comment